మనకు తెలీకుండా చేసే కొన్ని పనులు చివరకు గుండె పోటుకు దారి తీస్తాయి. అవేంటంటే.. 

తరచూ అధిక రక్తపోటును మనం నిర్లక్ష్యంగా తీసుకుంటాం. ఇది చివరకు గుండెపోటుకు దారి తీయొచ్చు. 

నిద్ర సరిగా లేకపోవడం గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 

అదుపులేని మధుమేహం కూడా చివరకు గుండెను హాని చేస్తుంది. 

ధూమపానం వల్ల కాలక్రమేణా ధమనులు దెబ్బతింటాయి. ఇది చివరకు గుండెపోటుకు దారి తీస్తుంది.

దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి కూడా చివరకు గుండెపై ప్రభావం కలిగిస్తుంది.

అధిక కొలెస్ట్రాల్ ధమనులపై ప్రభావం చూపి చివరకు గుండెపోటకు దారి తీస్తుంది. 

కొన్నిసార్లు వారసత్వం వల్ల కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.