ఎక్కువ సేపు నిద్రపోతే .. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!

ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా అసలు నిద్రపోవడానికి కూడా సమయం దొరకడం లేదు. త్వరగా నిద్ర కూడా రాదు

కొందరు ఐదారు గంటలు నిద్రపోతే.. మరికొందరు మాత్రం 10, 11 గంటలు నిద్రపోయే వారు కూడా ఉంటారు.

 అయితే తక్కువ సేపు పడుకుంటే ఎన్ని నష్టాలు ఉన్నాయో.. ఎక్కువ సేపు పడుకున్నా కూడా అంతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

ఎక్కువ సేపు పడుకోవడం వల్ల రక రకాల వ్యాధులు వస్తాయని అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

అతిగా నిద్రపోయే వారిలో ఒత్తిడి అనేది కూడా ఎక్కువగా పడుతుందని చెబుతున్నారు.

తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వారిలో 49 శాతం డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నాయట.

ఎక్కువ సేపు నిద్రపోతే మెదడు పని తీరు దెబ్బ తింటుందని నిపుణులు అంటున్నారు.

నిద్ర తక్కువ అయినా డయాబెటీస్ ముప్పు తప్పదు. అలాగే ఎక్కువ అయినా కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు రెండు రెట్లు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.