ఆముదం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతారు.
వీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు వెల్లడిస్తారు.
ఆముదాన్ని సంస్కృతంలో పంచాగుల, ఏరండ అని పిలుస్తారు.
ఆముదం మొక్కలో ప్రతి భాగం ఔషధ గుణాలుంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
దీనిని తాగడం వల్ల కడుపులో నులి పురుగులు దరి చేరవు.
ఆముదం ఆకులు, కర్పూరం మిశ్రమాన్ని మెత్తగా నూరాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని కట్టు కట్టుడం వల్ల మూల వ్యాధి తగ్గుతుంది.
స్త్రీలు నెలసరి సమయంలో పలు సమస్యలు ఎదుర్కొంటారు. అలాంటి వారు ఆముదం ఆకులను దంచి వేడి చేసి.. పొత్తి కడుపుపై ఉంచాలి. అలా చేయడం వల్ల నెలసరి వెంటనే వస్తుంది.
చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలకు చక్కటి పరిష్కారం ఆముదం. ఈ నూనె వాడడం వల్ల జుట్టు నల్లగా, పొడుగ్గా, ఒత్తుగా పెరుగుతుంది.
ఆముదం నూనెలో యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ నూనె వాడడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి.
చాలా మంది కీళ్లు, మోకాళ్ల నొప్పులతో బాధపడతారు. ఈ నొప్పులు త్వరగా తగ్గాలంటే.. ఆముదం ఆకులకు నువ్వుల నూనె రాసి వేడి చేయాలి. అనంతరం వాటిని నొప్పులు ఉన్న చోట కట్టాలి. ఇలా చేయడం వల్ల నొప్పి సమస్య దూరమవుతుంది.