జమ్మి చెట్టుతో ఇన్ని లాభాలా..  తెలిస్తే అస్సలు వదలరు...

జమ్మి చెట్టు కాండాన్ని నీటిలో వేడి చేసుకుని పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుందట.

నోటి అల్సర్లనూ తగ్గిస్తుంది. జమ్మి చెట్టు కాండం నుంచి ఎండిన పొడిని తీయవచ్చు. కాండాన్ని చూర్ణం చేసి వివిధ రకాల జబ్బులకు మందులా వాడతారు.

జమ్మిచెట్టు ఆకులను ముద్దలాగా చేసి చర్మం మీద రాసుకుంటే స్కిన్ ఎలర్జీలు తగ్గిపోతాయి.

చాలా మందికి అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడతారు. అలాంటి సమయంలో జమ్మిచెట్టు పండు లేదా కాయను నూరి క్రమం తప్పకుండా రాసుకుంటే సమస్య తగ్గుతుంది.

జమ్మి చెట్టును ఎయిర్ ప్యూరిఫైయర్ అనుకోవచ్చు. ఇది గాలిలో ఉండే హానికర కాలుష్య కారకాలను గ్రహించి గాలిని శుద్ధి చేస్తుంది.

జమ్మి చెట్టును ఇంటి బాల్కనీలోనూ పెంచుకోవచ్చు. సూర్యరశ్మి ఎక్కువగా ఉండే చోట నల్లమట్టిలో ఈ మొక్కను పెంచవచ్చు.