వీళ్ళు పొద్దున లేవగానే నీళ్లు తాగితే  యమా డేంజర్...

నీరు అనేది చాలా ముఖ్యం. మనిషి ప్రతీ అవసరాన్ని తీర్చేది నీళ్లే. నీరు లేనిదే ఏ పనీ పూర్తి కాదు.

ఇంట్లో పెద్దలు చాలా మందికి పొద్దున్నే నిద్రలేవగానే గ్లాసుడు నీళ్లు తాగడం అలవాటు.

ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగడం మంచి అలవాటు అయినప్పటికీ కొంతమంది ఆరోగ్యానికి ఇది మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సాధారణంగా నోటి లేదా దంత వ్యాధులు ఉన్నవారు ఖాళీ కడుపుతో నేరుగా నీళ్లు తాగకూడదు.

పయోరియా (చిగుళ్లవ్యాధి), నోటి పూత, నోటి క్యాన్సర్ వంటి సమస్యలు ఉన్నవారు అస్సలు ముట్టుకోకూడదు.

ఈ వ్యాధులు ఉన్నవారిలో నోటిలోని లాలాజలంలో హానికరమైన అంశాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలాంటి వారు ఉదయం నిద్రలేచిన వెంటనే నీరు తాగితే, నీటితో పాటు లాలాజలాన్ని మింగితే, హానికరమైన అంశాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.

ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నీరు తాగే ముందు నోటిని బాగా శుభ్రం చేసుకోవాలి. అప్పుడు నోటిలోని బ్యాక్టీరియా, విషపూరిత పదార్థాలు తొలగిపోతాయి. ఆ తర్వాత నీళ్లు తాగడం సురక్షితంగా ఉంటుంది.

ఖాళీ కడుపుతో సరిగ్గా నీరు తాగడం, నోటి పరిశుభ్రతను కాపాడుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.