కొబ్బరి నూనెలో మందార పువ్వులు
కలిపి పెట్టుకుంటే తెల్ల జుట్టుకు బైబై...
తెల్ల జుట్టును అరికట్టడానికి, మందార పువ్వులను, ఆకులను నూనెను వాడవచ్చు.
మందార పువ్వులు, ఆకులలో ఉండే పోషకాలు జుట్టుకు బలాన్నిచ్చి, జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు నల్లబడటానికి సహాయపడతాయి
కొబ్బరి నూనెలో మందార పువ్వుల పేస్ట్‌ను కలిపి తలకు పట్టించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఒక గిన్నెలో కొబ్బరి నూనె లేదా ఏదైనా నూనె తీసుకుని, అందులో తాజా మందార పువ్వులు, ఆకులను వేయాలి. ఈ మిశ్రమాన్ని నూనెలో బాగా మరిగించాలి.
మందారం పువ్వులు, ఆకులను మెత్తగా పేస్ట్‌లా చేసి, దానిని కొబ్బరి నూనెలో కలిపి తలకు పట్టించాలి. ఇది జుట్టుకు పోషణనిస్తుంది.
మందారంలో ప్రోటీన్ ఉంటుంది, ఇది జుట్టును బలపరుస్తుంది. మందారంలోని సహజ నూనెలు జుట్టును హైడ్రేట్ చేసి మెరిసేలా చేస్తాయి.
మందారంతో పాటు ఉసిరిని కూడా వాడటం వల్ల తెల్ల జుట్టు సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
Related Web Stories
పెరుగన్నంతో ఇన్ని లాభాలా.. ?
నీళ్లలో పటిక కలుపుకుని స్నానం చేయండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!
ఈ గింజల లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరండోయ్…
పొద్దున్నే లేవడానికి అలారం పెట్టుకుంటున్నారా? అయితే జాగ్రత్త..