పెరుగన్నంతో ఇన్ని లాభాలా.. ?
పెరుగన్నం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
పెరుగన్నం శరీరాన్ని చల్లబరుస్తుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.
పెరుగన్నంలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. క్రమం తప్పకుండా తినడం వల్ల రోగాల బారిన పడే అవకాశం తగ్గుతుంది.
శరీరంలోని చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుంది. జీర్ణవ్యవస్థకు, పేగుల ఆరోగ్యానికి మంచిది.
జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి పెరుగన్నం దివ్యౌషధం.
పెరుగులో ప్రోబయోటిక్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరచడమే కాకుండా.. ఉదర సమస్యలను తగ్గిస్తుంది.
చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఇది గట్స్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం.
బరువు తగ్గాలనుకునే వారికి పెరుగన్నం చాలా మంచిది. పెరుగులోని ప్రోటీన్లు, కాల్షియం ఆకలిని నియంత్రిస్తాయి. తద్వారా బరువు తగ్గ వచ్చు.
పెరుగన్నం తినడం వల్ల గ్యాస్,కడుపులో నొప్పి, మంటతోపాటు మల బద్దకం సమస్యలు దరి చేరవు.
Related Web Stories
నీళ్లలో పటిక కలుపుకుని స్నానం చేయండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!
ఈ గింజల లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరండోయ్…
పొద్దున్నే లేవడానికి అలారం పెట్టుకుంటున్నారా? అయితే జాగ్రత్త..
గుండెపోటుకు కారణాలు తెలుసా..?