నీళ్లలో పటిక కలుపుకుని స్నానం చేయండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!

ఆయుర్వేదంలో చాలా రకాలుగా ఉపయోగించే పటిక గురించి చాలా మందికి నిజాలు తెలియవు. పటికను నీటిలో వేసి స్నానం చేస్తే జరిగేదిదే..

నీటిలో పటిక కలిపి స్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి, చర్మానికి రెండింటికీ మేలు చేస్తాయి.

శరీరంలో వాపులు, నొప్పులతో ఇబ్బంది పడేవారు పటిక నీటితో స్నానం చేయడం వల్ల మంచి ఉపశమనం పొందుతారు.

చెమట, కాలుష్యం కారణంగా శరీరం దుర్వాసన వస్తుంటుంది. పటికను నీటిలో కలిపి స్నానం చేస్తుంటే ఈ దుర్వాసన తగ్గుతుంది.

 పటికలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరం నుండి బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది.

పటిక పూర్తీగా కరిగిన తరువాత స్నానం చేస్తే పటికలో గుణాలు శరీరానికి బాగా అందుతాయి.

వయసు పెరిగేకొద్దీ చర్మం కుంగినట్లుగా ఉంటుంది. అలాంటివారు పటిక వాడితే సమస్య తగ్గుతుంది.

ఈ వార్త కేవలం అవగాహన కోసమే అందించాం. విటిని పాటించే మరింత సమాచారం కోసం దయచేసి నిపుణుడిని సంప్రదించండి.