ఈ గింజల లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరండోయ్…

బొబ్బర్ల‌లో బోలెడ‌న్ని పోష‌క విలువ‌లు కూడా నిండి ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులతో పాటుగా పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా మ‌ధుమేహం ఉన్న వారు బొబ్బ‌ర్ల‌ను డైలీ డైట్‌లో చేర్చుకుంటే ఊహిచని ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.

వీటిని ఉడ‌క‌బెట్టి తింటే ఫైబ‌ర్ స‌మృద్ధిగా ల‌భిస్తుంది. ఇది కడుపు నిండిన భావ‌న‌ను క‌లిగిస్తుంది. ఫలితంగా బరువుతగ్గుతారు.

బొబ్బ‌ర్ల‌లో ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఇది గ‌ర్భిణీల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది.

బొబ్బర్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సిలు చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచి, మెరిసే, ఆరోగ్యవంతమైన చర్మాన్ని పొందవచ్చు.  

బొబ్బ‌ర్ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంది. 1 క‌ప్పు బొబ్బ‌ర్ల‌ను తిన‌డం వ‌ల్ల 194 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది.

బొబ్బ‌ర్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం దూరం చేస్తుంది.. గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం తగ్గుతుంది.