దానిమ్మ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల దీనిని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు
దానిమ్మ తినడం అందరికీ మంచిదికాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
కొన్ని వ్యాధులతో బాధపడేవారు, వ్యాధుల నివారణకు మందులు వాడేవారు దానిమ్మ తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే చాన్స్ ఉందని చెబుతున్నారు.
తక్కువ రక్తపోటు (హైపోటెన్షన్) వంటి సమస్యతో బాధపడేవారు దానిమ్మను ఎక్కువగా తినడం హానికరమని నిపుణులు చెబుతున్నారు.
దానిమ్మలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు మంచిది, కానీ కడుపు సమస్యలు ఉన్నవారు దీనిని ఎక్కువగా తినకూడదు.
ఎందుకంటే ఇందులో ఉండే టానిన్లు కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం లేదా విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తాయి.
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు దానిమ్మ పండును తీసుకుంటే మరింత తీవ్రమవుతుంది.
దానిమ్మపండు తిన్నా లేదా దాని జ్యూస్ తాగినా మీకు చికాకు, దురద లేదా ఏదైనా చర్మ సమస్య ఉంటే మీరు వెంటనే దానిని తినడం మానేసి వైద్యుడిని సంప్రదించం ఉత్తమం.