ఈమధ్య కాలంలో చాలామంది చికెన్, మటన్ లివర్స్ ఎక్కువగా తింటున్నారు.
ఆదివారం వచ్చిందంటే చాలు అందరి ఇళ్ల నుంచి ఘుమఘుమలాడే సువాసనలు వస్తాయి. కొంత మంది ఇంట్లో చేసుకుంటే.. మరికొంత మంది అలా రెస్టారెంట్లు, హోటల్స్ చుట్టేసి వస్తారు.
వీటిలో వివిధ రకాల ఖనిజాలు, పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి మంచివనే ఉద్దేశంతో వైద్యులు కూడా వీటిని డైట్‌లో యాడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ క్రమంలో మటన్ షాపులో అరుదుగా లభించే ఒక పదార్థం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.. అదే తిల్లి. తిల్లీ అంటే గొర్రె లేదా మేకలో ఉండే ప్లీహం భాగం.
తిల్లీ ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు. ఈ పోషకాలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అత్యంత అవసరం.
తిల్లీ ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు. ఈ పోషకాలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అత్యంత అవసరం.
తిల్లీని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు వేగంగా పెరిగి ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుంది.
రక్తహీనతతో పాటు జ్వరం లేదా శస్త్రచికిత్స తర్వాత బలహీనపడిన వారికి, పెరుగుతున్న పిల్లలకు, గర్భిణులకు, వృద్ధులకు ఇది గొప్ప శక్తిని అందిస్తుంది.
మేక కాలేయంలో కూడా పోషకాలు ఉన్నప్పటికీ, తిల్లీలో ఉండే ప్రత్యేకమైన ప్రోటీన్లు, ఎంజైముల మిశ్రమం రక్తాన్ని మెరుగుపరచడంలో మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది.