అల్పాహారంలో ఇవి తింటే ఎసిడిటీ..!

ఉదయం తినే అల్పాహారం చాలా ముఖ్యం. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు తగిన శక్తి లభించేది దీనివల్లే.

బ్రేక్‌ఫాస్ట్‌గా మనం తీసుకునే ఏఏ పదార్థాలు ఎసిడిటీకి కారణమవుతాయో తెలుసుకుందాం.

పొద్దున లేవగానే కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. ఇందులోని కెఫీన్ ఆమ్లతకు కారణమవుతుంది.

అల్పాహారంలో నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు తీసుకుంటే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉత్పన్నమవుతుంది.

మార్నింగ్ ఖాళీ కడుపుతో పెరుగు తింటే అసిడిటీ వస్తుంది. అందుకే తర్వాత తినడమే మంచిది.

అల్పాహారంలో తీపి తినే అలవాటు అసిడిటీని సృష్టిస్తుంది. ఇందులో థియోబ్రోమిన్ ఉండటమే అందుక్కారణం.

బ్రేక్‌ఫాస్ట్‌లో జ్యూస్ తీసుకోవడం ప్రమాదకరం. వీటిని తాగితే వెంటనే అసిడిటీ రావచ్చు.

పై ఆహారాలకు బదులు గంజి, ఓట్స్, గుడ్లు, తాజాపండ్లు, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, పప్పు, తృణధాన్యాలు మొదలైనవి తినండి.