ఈ లక్షణాలు ఉంటే పెద్ద పేగు క్యాన్సర్ ఉన్నట్లే ! త్వరగా గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు
ఒకప్పుడు నలభై సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పడు యువత కూడా క్యాన్సర్ బారిన పడుతోంది.
వైద్యులు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
యువతలో ఈ లక్షణాలు కనిపిస్తే పెద్దపేగు క్యాన్సర్ ఉన్నట్లేనంట. ఆ లక్షణాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
మారుతున్న జీవనశైలి, తీసుకుంటున్న ఆహారం వల్ల చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా యువత పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడి సమస్యలు ఎదుర్కొంటున్నారు.
25 నుంచి 49 ఏళ్ల వయసు మధ్య గల యువకులు ప్రస్తుత రోజుల్లో పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడుతున్నారు.
అయితే ఇది వారసత్వంగా లేదా కొలిబాక్టిన్ బ్యాక్టీరియా వల్ల వస్తుందని చెబుతున్నారు.
రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం లేదా అధిక బరువు ఊబకాయం వలన పెద్ద పేగు క్యాన్సర్ వస్తుందంట.
ధూమపానం, పొగాకు వాడకం కూడా దీనికి కారణం అవుతుంది.
ఈ క్యాన్సర్ ఉంటే ఆకస్మికంగా బరువు తగ్గడం, మలబద్ధకం, మలంలో రక్తం పడడం, విపరీతమైన కడుపునొప్పి, బలహీనత, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.