ద్రాక్ష పండ్లను మాత్రమే కాదు వాటి ఆకులను తింటే కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు
ద్రాక్ష ఆకులలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
ద్రాక్ష ఆకుల్లో కూడా విటమిన్ ఎ, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. రెటీనా పనితీరుకు మద్దతు ఇస్తాయి.
ద్రాక్ష ఆకులు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఆర్థరైటిస్,ప్రేగు వ్యాధి సమస్యలతో పాటు సాధారణ శరీర నొప్పులను తగ్గిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు
ద్రాక్ష ఆకులు పొటాషియం, మెగ్నీషియంను అందిస్తాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో.. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ద్రాక్ష ఆకులు విటమిన్ K కి అద్భుతమైన మూలం అని చెప్పొచ్చు. విటమిన్ K ఎముక ఖనిజ సాంద్రతను పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది.