ఉదయం వీటిని తింటే కొన్ని రోజుల్లోనే  ఈ వ్యాధులన్నీ నయం..

ప్రతి ఉదయం నానబెట్టిన జీడిపప్పు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

 ఉదయం జీడిపప్పు తినడం వల్ల గుండె జబ్బులు ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జీడిపప్పులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి.

జీడిపప్పులో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

మెదడు పనితీరును మెరుగుపరచడంలో జీడిపప్పు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

దీనిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు మెదడు నాడీ పనితీరును మెరుగుపరుస్తాయి.

రాత్రిపూట వాటిని నీటిలో నానబెట్టి, వడకట్టి ఉదయం తినండి.

ఉదయం ఖాళీ కడుపుతో 4 నుండి 5 నానబెట్టిన జీడిపప్పు తినండి.  ఒకేసారి ఎక్కువ జీడిపప్పు తినడం వల్ల ప్రయోజనానికి బదులుగా హాని కలుగుతుంది.