మల విసర్జన చేయడానికి సరైన టైం ఏదో తెలుసా..
ఏం తింటున్నాం.. ఎంత తింటున్నామని మాత్రమే కాదు.. మల విసర్జనపై కూడా మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది
మల విసర్జన విషయంలో చాలా మందిని వేధించే ప్రశ్న ఏంటంటే.. రోజులో ఏ సమయంలో మల విసర్జన చేయటం మంచిది అని..
దీనిపై గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌లు ఏమంటున్నారంటే.. ఉదయం లేవగానే మల విసర్జనకు వెళ్లటం అన్నది చాలా మంచిదట. మన శరీరానికి చాలా మేలు జరుగుతుందట.
సాధారణంగా మనం నిద్రపోయిన తర్వాత జీర్ణ వ్యవస్థకు పోషకాలను గ్రహించటంలో చాలా సమయం దొరుకుతుంది.
ఆ తర్వాత వ్యర్థాలను పెద్ద పేగుల్లోకి తోస్తుంది. నిద్ర లేచిన 30 నిమిషాల తర్వాత.. జీర్ణ వ్యవస్థ మల విసర్జన చేయమంటూ సిగ్నల్స్ పంపుతుంది.
ఉదయం పూట మల విసర్జన చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. మొదటగా మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది
మనం శరీరంలోని చెత్త ఉదయాన్నే బయటకు వెళ్లిపోవటం వల్ల శరీరం ఎంతో ఉత్సాహంగా తయారు అవుతుంది.
ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ వల్ల మెదడు రీఫ్రెష్ అవుతుంది. మెంటల్ క్లారిటీ వస్తుంది.
Related Web Stories
ఆయుర్వేదం ప్రకారం, వీటిని పొరపాటున కూడా కలిపి తినకూడదు..ఎందుకంటే
ఇలా చేయండి నడుము నొప్పి పరార్
బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే. వచ్చే లాభాలు!
బెల్లం టీ తాగితే జరిగేది ఇదే..