నిమ్మ కాయలతోనే కాదు.. నిమ్మ తొక్కలతో సైతం అనేక లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నిమ్మకాయ తొక్కలో పోషక విలువలున్నాయి. నిమ్మతొక్కలో సైతం విటమిన్ సి ఉంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
నిమ్మ తొక్కలలో ఉండే బయోఫ్లావనాయిడ్స్ ఎముకల ఆరోగ్యానికి, ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి.
నిమ్మ తొక్కలు యాంటీ బాక్టీరియల్ భాగాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని నిర్వహించడానికి, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే ఫ్లేవనాయిడ్‌లతో నిండి ఉన్నాయి.
నిమ్మ తొక్కలలోని ఫైబర్ కంటెంట్ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది.
గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే ఈ ప్రక్రియలో బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది.
నిమ్మ తొక్కలలో ఉండే బయోఫ్లావనాయిడ్స్ ఎముకల ఆరోగ్యానికి, ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి.