టీ తాగేవారికి.. బిగ్ అలర్ట్

టీ.. చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. మరీ ముఖ్యంగా ఆఫీసుల్లో పని చేసే వారు రోజుకు రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ సార్లు తాగుతుంటారు.

టీ ఎక్కువగా తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అతిగా టీ తాగడం వల్ల అనేక రకాల సమస్యలు  వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

ప్రస్తుతం వర్ష కాలం. ఈ కాలంలో తేమ అధికంగా ఉంటుంది. అలాగే వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. చాలా మంది టీ తాగడానికి ఆసక్తి చూపిస్తారు.

రోజుకు రెండు లేదా మూడు కప్పుల టీ తాగడం వల్ల ఐరన్ లోపం, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయంటున్నారు.

అధికంగా టీ తాగడం వల్ల.. తల తిరగడం, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు అధికమవుతాయని అంటున్నారు.

మరికొందరు అధిక మోతాదులో బ్లాక్ టీ లేదా టీ తీసుకుంటుంటారు. దీని వల్ల గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

అధికంగా టీ తాగడం వల్ల చేతులు వణకడం, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటున్నారు.

టీ ఎక్కువగా తీసుకునే వారిలో ఆందోళన పెరగడం.. గుండె వేగంగా కొట్టుకోవడం.. రక్తపోటు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు.

మరికొందరిలో బరువు తగ్గిపోతారంట. అందువల్ల వీలైనంత వరకు టీని తక్కువ మోతాదులో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పరగడుపున టీ తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎముకలు సైతం బలహీన పడడమే కాకుండా.. అవి విరిగే ప్రమాదం సైతం ఉందంటున్నారు.