నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే  అలవాట్లు ఇవే..

రోజు రోజుకీ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. క్యాన్సర్‌లో అనేక రకాలున్నాయి. వాటిల్లో ఒకటి నోటి క్యాన్సర్.

ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. నోటి క్యాన్సర్ కారణంగా.. పెదవులు, నాలుక, బుగ్గలు, గొంతు కణజాలాలు ప్రభావితమవుతాయి.

పొగాకు, ధూమపానం: పొగాకు నమలడం, గుట్కా, పాన్ మసాలా, సిగరెట్లు కాల్చడం నోటి క్యాన్సర్‌కు అతిపెద్ద కారణాలు.

 ఆల్కహాల్, పొగాకు రెండింటినీ ఉపయోగించేవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

కూరగాయలు తక్కువగా తినడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు లోపానికి దారితీస్తాయి

 దంతాలు, నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. ఇది దీర్ఘకాలంలో నోటి క్యాన్సర్‌కు దారితీస్తుంది.

HPV వైరస్ నోటి క్యాన్సర్‌కు కారణమవుతుంది.ఈ వైరస్ అసురక్షిత శారీరక కలయిక లేదా ఈ HPV వైరస్ సోకిన వ్యక్తితో కలయిక ద్వారా వ్యాపిస్తుంది.