జుట్టు ఆరోగ్యానికి..  ఈ జాగ్రత్తలు..

జుట్టుకు మేలు చేసే వాటిల్లో  విటమిన్ బీ7 చాలా  ముఖ్యమైనది. ఇది కెరాటిన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది.

జుట్టులో కెరాటిన్ ఉంటుందన్న విషయం తెలిసిందే. విటమిన్ బీ7 లోపిస్తే వెంట్రుకలు  సన్నగా మారతాయి.

జుట్టు కుదుళ్లు మొదలు  శరీరంలో అన్ని కణాల  ఎదుగుదలకు విటమిన్ ఏ కీలకం.

యాంటీఆక్సిడెంట్ గుణాలున్న విటమిన్ సీతో జుట్టుకు ఫ్రీ రాడికల్స్ అనే రసాయనాల నుంచి రక్షణ లభిస్తుంది. 

జుట్టు ఎదుగుదలకు కీలకమైన  ఐరన్ శరీరం గ్రహించేందుకు  కూడా విటమిన్ సీ అవసరం.

విటమిన్ డీ లోపం కారణంగా ఆలోపేషియా వస్తుంది.  అంటే నెత్తిపై కొన్ని చోట్ల  జుట్టు పలుచబడుతుంది. 

ఇక విటమిన్ డీ సమృద్ధిగా  ఉంటే నెత్తిపై కొత్తగా కుదుళ్లు  కూడా ఏర్పడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.