ఈ టైమ్‌లో  స్వీట్స్ తింటే నో టెన్షన్..

స్వీట్స్ అంటే ఇష్టపడని వారు దాదాపుగా ఉండరనే చెప్పాలి. 

భోజనం తరువాతే స్వీట్ తినేందుకు అత్యంత అనుకూల సమయం.

ఉదయాన్నే లేదా పరగడుపును స్వీట్స్‌ ఇతర చక్కెర పదార్థాలు అస్సలు తినకూడదని అంటుంటారు. 

ఉదయాన్నే ఖాళీ కడుపుతో స్వీట్స్ తింటే అవి త్వరగా అరిగిపోతాయి. దీంతో, రక్తంలో చక్కెర స్థాయిలో ఒక్కసారిగా పెరుగుతాయి.

మధ్యాహ్నం భోజనం తరువాత తింటే.. స్వీట్స్‌లోని చక్కెరలను శరీరం అంత త్వరగా గ్రహించలేదని జెస్సీ పేర్కొంది.

అప్పటికే తిన్న ఆహారంలోని ప్రొటీన్లు, పీచు పదార్థం, ఆరోగ్యకర కొవ్వులు వంటివన్నీ చక్కెరను శరీరం త్వరగా గ్రహించకుండా అడ్డుపడతాయి.

దీంతో, రక్తంలో చక్కెర  స్థాయిలో భారీగా పెరగవని పేర్కొంది.