ఈ అలవాట్లు మీ రక్తపోటును  పెంచుతాయి.. బీ కేర్ ఫుల్..

అధిక ఉప్పు తినడం వల్ల శరీరంలో నీటి పరిమాణం పెరుగుతుంది. ఇది రక్త నాళాలపై ఒత్తిడిని కలిగిస్తుంది.

ఉప్పును సమతుల్య పరిమాణంలో  తీసుకోవడం మంచిది.

ఎక్కువసేపు కూర్చోవడం  వల్ల కూడా ఊబకాయం వస్తుంది. ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

కాబట్టి, ఎక్కువ సేపు అలానే కూర్చోకుండా శారీరానికి  కాస్త పని చెప్పండి.

మానసిక ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం వల్ల కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను పెంచుతుంది.

కాబట్టి, 7-8 గంటలు నిద్ర ఉండేలా టైం ప్లాన్ చేసుకోండి.

తరచుగా కొంతమంది టీ లేదా కాఫీని అధికంగా తీసుకుంటారు. నిజానికి, వాటిలో ఉండే కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు వస్తుంది. 

కాబట్టి టీ లేదా కాఫీ చాలా పరిమిత పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.