జుట్టు తలతలా మెరవాలా.. అయితే గుడ్డుతో ఇలా చేసేయండి!
గుడ్లను ఆహారంగానే కాదు.. జుట్టు సంరక్షణ కోసం కూడా వాడుతుంటారు.
కోడి గుడ్డులో ఉండే పోషకాలు, బయోటిన్, బీ కాంప్లెక్స్, విటమిన్లు జుట్టు మూలాల నుంచి బలోపేతం చేస్తాయి. అంతేగాక కొత్త జుట్టు పెరిగేందుకు సాయపడతాయి.
గుడ్డులోని పచ్చసొనలో ఉండే లుటిన్ మన కేశాలను దృఢంగా చేసి.. తెగిపోకుండా కాపాడుతుంది.
తెల్లసోనను జుట్టుకు రాసి అరగంట తర్వాత తల స్నానం చేస్తే.. షైనింగ్‌గా ఉండటంతో పాటు కురులు మరింత మృదువుగా మారతాయి.
ఒక గిన్నెలో 2 గుడ్లలోని సోన, ఒక చెంచాడు ఉల్లిపాయ రసం వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ రాసి.. 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీరు, షాంపూతో కడగాలి.
ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్.. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. జుట్టులోని ఫోలికల్స్‌ను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
Related Web Stories
నెయ్యి టీ.. ఎన్ని లాభాలో తెలుసా..
ప్రీ-డయాబెటిస్ నయం చేసేందుకు మార్గాలు ఇవే..
ఈ అలవాట్లే కీళ్ల నొప్పులకు కారణం..
పిల్లల డైట్ ప్లాన్ ఎలా ఉండాలంటే..