పిల్లల డైట్‌ ప్లాన్‌  ఎలా ఉండాలంటే..

డైట్‌ ప్లాన్‌ అంటే సమతులమైన ఆహారం ఎలా తీసుకోవాలో తెలియచేయడం.  

పిల్లల వయసు, ఎదుగుదల  తీరును బట్టి వివిధ రకాల  ఆహార పదార్థాలను ఇవ్వాలి.

పిల్లలకు ఆహారం సూచించేప్పుడు వారిలో ఏవైనా పోషక లోపాలున్నాయేమో పరిశీలించాలి. 

ఎత్తు, బరువును చూడాలి. ఇంకా వారి ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఆరోగ్య కరమైన ఆహారపు అలవాట్లను నేర్పించే సూచనలు చేయవచ్చు. 

సాధారణంగా మూడు నుంచి పదేళ్లలోపు పిల్లలకు ప్రతి మూడు నాలుగు గంటలకు ఓసారి ఏదైనా ఆహారం ఇవ్వడం మంచిది. 

 రోజువారీ ఆహారంలో ధాన్యాలు పప్పు ధాన్యాలు, గింజలు వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పాలు,పెరుగు, నెయ్యి తప్పని సరిగా ఉండాలి. 

వారానికి మూడు నాలుగు సార్లు గుడ్లు, ఓసారి చికెన్‌, చేపలాంటివి చేరిస్తే మంచిది.