ఒక్క ఆకుతో వంద అనారోగ్య సమస్యలకు  చెక్

వాము ఆకుల వల్ల చాలా ఉపయోగాలున్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చలికాలంలో ఈ వాము ఆకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.

వాము ఆకులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ తదితర ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వాము ఆకు సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు సమస్యలను దూరం చేస్తుంది.

వాము ఆకు తింటే జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. అజీర్ణ సమస్యతో కడుపు ఉబ్బరంగా ఉన్నవారు ఈ ఆకు తింటే సమస్య తగ్గుతుంది. ఈ ఆకు తింటే అధిక రక్తపోటు సైతం నియంత్రణలోకి వస్తుంది.  

ఈ ఆకు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఇది కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆకులను నమలడం వల్ల కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

రోజూ రెండు ఆకులు నమలడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటే.. ఈ ఆకు తీసుకుంటే కొవ్వు తగ్గుతుంది. డయాబెటిస్‌తో ఇబ్బంది పడేవారు వాము డికాషన్‌ తాగితే వ్యాధి నుండి త్వరతిగతిన ఉపశమనం లభిస్తుంది.

కొన్ని వాము ఆకులు తీసుకుని బాగా నలిపి వాసన చూస్తే ముక్కు దిబ్బడ సైతం తగ్గుతుంది. పంటి నొప్పితో ఇబ్బంది పడుతుంటే.. ఈ ఆకులను మరిగించిన నీటిని తాగడం ఆ సమస్య నుంచి నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఈ ఆకులు నమలడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెరుగుపడుతుంది. మధుమేహం నియంత్రణలో సహాయపడుతుంది. 

కొన్ని వాము ఆకులను నీళ్లలో వేసి మరిగించి తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

శ్వాసకోశ సమస్య ఉన్నట్లయితే వాము ఆకులను చూర్ణం చేసి, వాసన చూసిన, ఆకులతో కాచిన నీటిని తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.