ఈ అలవాట్లే కీళ్ల
నొప్పులకు కారణం..
పెద్ద వయసులోనూ దృఢంగా, ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే కీళ్లు, ఎముకల ఆరోగ్యం కాపాడుకోవడం చాలా అవసరం.
వయసు పెరిగే కొద్దీ, ముఖ్యంగా 40-45 సంవత్సరాల తర్వాత చాలా మందికి మోకాళ్ల
నొప్పులు, కీళ్ల నొప్పులు వస్తాయి.
ముఖ్యంగా ఎముకల కోత,
ఎముక సాంద్రత తగ్గడం, శరీరంలో కాల్షియం లేదా ఇనుము తక్కువగా ఉండటం వల్ల
మోకాళ్ల నొప్పులు వస్తాయి.
ఇది తరచుగా వృద్ధాప్యంలో
వచ్చే సర్వసాధారణ సమస్య
అనే అనుకుంటారు.
చాలామందికి తెలియని విషయమేంటంటే, మోకాళ్ల నొప్పులు వయస్సు వల్లే కాదు. మన చెడు అలవాట్ల వల్ల కూడా వస్తాయి.
పని ఒత్తిడి కారణంగా చాలా మంది ఒకే చోట బలవంతంగా 8 గంటలకు పైగా కూర్చుని పని చేస్తారు.
మధ్య మధ్యలో లేచి శరీరానికి కొంచెం విశ్రాంతి కూడా ఇవ్వలేని పరిస్థితిలోనే పనిచేస్తుంటారు.
దీనివల్ల రక్త ప్రసరణ సరిగా ఉండదు. ఇది వెన్నునొప్పి, మోకాలి నొప్పికి దారితీస్తుంది.
కాబట్టి, పని మధ్యలో ప్రతి అరగంటకోసారి లేచి 5 నిమిషాలు అటూ ఇటూ నడవటం అవసరం. అప్పుడు శరీరం, కాళ్లు తేలికపడతాయి.
Related Web Stories
పిల్లల డైట్ ప్లాన్ ఎలా ఉండాలంటే..
ఇది తింటే జీవితంలో క్యాన్సర్ రాదట!
ఈ ఒక్క ఆకుతో వంద అనారోగ్య సమస్యలకు చెక్
ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే అల్లం ముక్క ఎలా తీసుకోవాలంటే