జుట్టు రాలే సమస్యకు  కారణమయ్యే అలవాట్లు ఇవే..

వేయించిన, ఆయిల్ ఫుడ్స్‍లో ఉండే కొవ్వులకు.. డైహైడ్రోటెస్టోస్టెరాన్, టెస్టోస్టెరాన్ స్థాయిలకు మధ్య లింక్ ఉంటుంది. 

ఇది బట్టతలకు కారణమయ్యే హార్మోన్. అలాగే అధిక ఉష్ణోగ్రత వద్ద వండిన ఆహారం శరీరంలో ఆక్సికరణ ఒత్తిడి పెంచుతుంది.

మాకేరెల్, సుషీ, ట్యూనా వంటి చేపలలో పాదరసం ఎక్కువ ఉంటుంది. వీటిని ఎక్కువ తింటే జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది.

ప్రోటీన్లలో జుట్టు పెరుగుదలకు అవసరమైన అమైనో అమ్లాలు ఉంటాయి. హెయిర్ ఫోలికల్స్ సరిగ్గా పెరగడానికి ఇవి కారణం అవుతాయి.

ప్రోటీన్ లోపిస్తే జుట్టు పెరుగుదల లేకపోగా  జుట్టు రాలిపోతుంది.

కాల్షియం లోపం కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణం అవుతుంది.

జింక్, ఐరన్ జుట్టు ఆరోగ్యానికి, కెరాటిన్ పెరుగుదలకు అవసరం. ఇది లోపిస్తే కెరాటిన్ పెరుగుదల తగ్గి జుట్టు తెల్లబడటం, రాలిపోవడం జరుగుతుంది.