షుగర్ సమస్యకు పైసా ఖర్చు లేని  పరిష్కారం.   

నేరేడు పళ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని అందరూ ఇష్టంగా తింటారు.

వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఇరన్ ఉంటాయి. ఇవి శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

నేరేడు పళ్లు అందరూ తింటారు. కానీ వాటి గింజలను పడేస్తారు. ఈ గింజల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు. 

మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందుకు జీవనశైలి మారడంతోపాటు వ్యాయామం లేక పోవడం ఒక కారణం. నిద్రలేమి సమస్య కూడా ఒక కారణం.

నేరేడు గింజల పొడి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

నేరేడు విత్తనాల్లో అనేక పోషకాలున్నాయి. ఇవి పలు వ్యాధులను నివారిస్తాయి. ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. 

వీటిలో రోగ నిరోధక శక్తికి పుష్టి నిచ్చే పోషకాలు ఉంటాయి.

మధుమేహం కారణంగా.. అధిక దాహంతోపాటు తరచూ మూత్ర విసర్జన చేస్తుంటారు. నేరేడు గింజలలోని ఆల్కలాయిడ్స్ ఈ లక్షణాలను నియంత్రిస్తాయి.

నేరేడు గింజల్లో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో అదనపు చక్కెరను నియంత్రించడానికి, చక్కర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.

అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తుల బరువును తగ్గిస్తుంది. జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

తొలుత నేరేడు గింజలపై తొక్క తీసి ఎండలో ఆరబెట్టాలి. తర్వాత గింజలను మిక్సీలో మెత్తగా పౌడర్  చేసుకోవాలి.

కొన్ని ఆయుర్వేద షాపుల్లో సైతం నేరేడు పండు విత్తనాల చూర్ణం దొరుకుతుంది. రోజూ గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ నేరేడు విత్తనాల పౌడర్ తీసుకోవాలి. దీని వల్ల షుగర్ సమస్య అదుపులో ఉంటుంది.