చర్మంలో ఈ మార్పులు కనిపిస్తే  ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్  లోపం ఉన్నట్టే..

ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ చర్మంపై ఓ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తాయి. 

దీంతో, చర్మంపై తేమ నిలిచి ఉండటమే కాకుండా అలర్జీ కారకాల నుంచి కూడా రక్షణ లభిస్తుంది.

ఇక ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ లోపించిన సందర్భాల్లో పలు చర్మ సంబంధిత సమస్యలు మొదలవుతాయి. 

చర్మం పొడిగా మారడం, పొట్టు రేగడం, దురదలు, సున్నితంగా మారడం వంటివన్నీ ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ లోపాన్ని సూచిస్తాయి.

మొటిమలు నిత్యం వేధించడం, చిన్న వయసులోనే చర్మం ముడతలు పడటం వంటివన్నీ ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ లోపం వల్ల తలెత్తుతాయి.

 గాయాలు నెమ్మదిగా మానుతున్నా, చికిత్సల తరువాత కూడా మొటిమలు వేధిస్తున్నా ఈ ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉన్నట్టు భావించాలి.