బరువు పెరిగిపోతున్నారా?
ఇవి కారణం కావొచ్చు..!
అకస్మాత్తుగా బరువు పెరుగుతుంటే, ముఖ్యంగా పొట్ట పెరుగుతుంటే షుగర్ టెస్ట్ చేయించుకోండి. కొందరిలో మధుమేహం వల్ల బరువు పెరగడం, తగ్గడం కూడా జరుగుతుంది.
మీ బరువు పెరగడానికి థైరాయిడ్ కూడా కారణం కావచ్చు. హార్మోనల్ సమస్యలైన హైపో థైరాయిడిజమ్, పీసీఓడీ కూడా బరువును పెంచేస్తాయి.
మీరు నిద్రలేమితో బాధపడుతుంటే, మెటబాలిజమ్‌ను తగ్గించే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఫలితంగా బరువు పెరుగుతారు.
కిడ్నీ, లివర్ వైఫల్యం వల్ల శరీరంలో ఫ్లూయిడ్ రిటెన్షన్ పెరిగి తాత్కాలికంగా బరువు పెరుగుతారు.
మీరు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారేమో చెక్ చేసుకోండి. ఒత్తిడి వల్ల అధికంగా ఆహారం తీసుకోవడంతో పాటు బరువు కూడా పెరగుతారు.
రాత్రి 8 గంటలు దాటిన తర్వాత ఎక్కువ కొవ్వు ఉండే ఆహార పదార్థాలను తరచుగా తింటున్నారేమో చెక్ చేసుకోండి.
యాంటీ డిప్రసెంట్, స్టిరాయిడ్స్, మానసిక సమస్యలకు తీసుకునే మందులు వల్ల బరువు పెరుగుతారు.
వయసు పెరుగుతున్న కొద్దీ మెటబాలిజమ్ తగ్గిపోతుంది. 40 ఏళ్ల దాటాక తిండి తగ్గించకపోతే అది శరీరంలో కొవ్వులా నిలవ ఉండిపోతుంది.
కొందరిలో జన్యుపరమైన సమస్యల వల్ల కూడా ఓ వయసు వచ్చే సరికి మెటబాలిజమ్ తగ్గిపోతుంది. అధిక బరువు సమస్య మొదలవుతుంది.
Related Web Stories
వర్షాకాలంలో రాగి జావ తాగితే ఏమవుతుందో తెలుసా..
చికెన్ స్కిన్‌తో బోలెడు లాభాలు.. కానీ వీళ్లకు ఫుల్ డేంజర్!
అరటిపండు పువ్వు మగవారిలో ఈ సమస్యలకు దివ్య ఔషధం
చేపలతో కలిపి వీటిని తినొదు..