వ‌ర్షాకాలంలో రాగి జావ‌ తాగితే ఏమవుతుందో తెలుసా..

వ‌ర్షాకాలంలో రాగి జావ‌ తాగితే అనేక లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వ‌ర్షాకాలంలో మ‌న జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మంద‌గిస్తుంది. గాలిలో ఉండే తేమ కార‌ణంగా మ‌న మెట‌బాలిజం త‌గ్గుతుంది...

 ఈ స‌మ‌యంలో రాగి జావ‌ను తాగ‌డం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.

జావ‌ను తాగితే సుల‌భంగా జీర్ణం అవ‌డ‌మే కాదు జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగుపడుతుంది.

రాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబ‌ర్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించేందుకు దోహ‌దం చేస్తాయి.

రాగుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముక‌ల‌ను దృఢంగా మార్చి, ఆరోగ్యంగా ఉంచుతుంది

రాగి జావ‌ తాగితే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.

దీంతో రోగాలు, ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. క‌నుక వ‌ర్షాకాలంలోనూ క‌చ్చితంగా రాగి జావ‌ను తాగాల్సిందే.