చికెన్ స్కిన్‌తో బోలెడు లాభాలు.. కానీ వీళ్లకు ఫుల్ డేంజర్!
చికెన్‌ను స్కిన్‌తో తినకూడదని, అలా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుందని అనుకోవడం అపోహేనని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
చికెన్ స్కిన్‌లో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయని అంటున్నారు.
చికెన్ స్కిన్‌లో కొల్లాజెన్ ఉంటుంది. ఇది మన చర్మం, శిరోజాలు, గోర్ల సంరక్షణ, పెరుగుదలకు సాయపడుతుంది.
చికెన్‌ను స్కిన్‌తో తింటేనే ఎక్కువ రుచిగా ఉంటుంది. పైగా వంట వండే సమయంలో పోషకాలు ఎక్కువగా కోల్పోకుండా ఉంటాయి.
చికెన్‌ను స్కిన్‌తో సహా తింటే ఇది బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.
అధిక బరువు ఉన్నవారు, కొలెస్ట్రాల్ స్థాయులు అధికంగా ఉన్నవారు, గుండె జబ్బులతో బాధపడేవారు చికెన్‌ను స్కిన్‌తో సహా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చికెన్ స్కిన్‌లో సోడియం అధికంగా ఉంటుంది కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా దీన్ని తినకూడదని అంటున్నారు.