30 ఏళ్లు దాటితే కచ్చితంగా  చేయించుకోవాల్సిన  మెడికల్ టెస్టులు ఇవే..

30 సంవత్సరాల నుండి ప్రతి స్త్రీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాలి.

దానితో పాటు హెచ్‌పివి పరీక్ష చేయడం చాలా మంచిది. 

పురుషులు, మహిళలు ఇద్దరూ 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రీడయాబెటిస్, హైపర్‌టెన్షన్, కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిస్ కోసం టెస్ట్ చేయించాలి.

ఊబకాయం ఉన్నవారు వెంటనే డైటీషియన్‌ను సంప్రదించి, బాడీ మాస్ ఇండెక్స్‌‍ని పరీక్ష చేయించుకుని, బరువు తగ్గడానికి ప్రయత్నించాలి.

రుతుక్రమం ఆగిపోయిన దశలో ఉన్న స్త్రీలు తప్పనిసరిగా బోలు ఎముకల వ్యాధి కోసం పరీక్షించబడాలి. 

5o నుంచి 80 సంవత్సరాల వయస్సు గల పురుషులు, మహిళలు ఇద్దరూ ఊపిరితిత్తుల క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.