డ్యాన్స్ చేయడం వల్ల  కలిగే ఆరోగ్య లాభాలు ఇవే..!

 డ్యాన్స్ చేయడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. 

ఇది శరీరంలో ఎండార్పిన్లను విడుదల చేస్తుంది. మానసిక స్థితిని మెరుగు పరచడంలో ఎండార్పిన్ల పాత్ర ముఖ్యమైనది.

ఆందోళనకు చెక్ పెట్టాలంటే రోజులో కొద్దిసేపు డ్యాన్స్ చేయడం మంచిది.

ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచడంలో కూడా డ్యాన్స్ కీలకపాత్ర పోషిస్తుంది.

 జీవితంలో ఎదురయ్యే సమస్యలకు అయినా చురుగ్గా, తెలివిగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

డ్యాన్స్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.

కండరాల బలం, శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.