గుండె ఆరోగ్యాన్ని పెంచే  ఆహార పదార్థాలు ఇవే..

ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగింది.

అయితే, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

బీట్‌రూట్‌లో నైట్రేట్‌లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

రెడ్ క్యాప్సికమ్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

యాపిల్స్ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి.

స్ట్రాబెర్రీలలో లైకోపీన్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి బిపిని నియంత్రించడంలో సహాయపడటం తోపాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

టమాటోలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉన్నందున ఇది గుండెకు అద్భుతమైన ఆహారం.

డార్క్ చాక్లెట్ తింటే రక్తపోటును తగ్గస్తుంది. గుండె సమస్యలను దరిచేరనీయదు.