కొత్తిమీరలో విటమిన్‌ ఏ సీ,  కెరోటినాయిడ్లు, పుష్కలంగా ఉంటాయి.

డైటరీ ఫైబర్‌, ఐరన్‌, మాంగనీస్‌, కాల్షియం, విటమిన్‌ కె, ఫాస్పరస్‌ వంటి పోషకాలు కొత్తిమీర ఆకులలో ఉన్నాయి.

అజీర్ణానికి కొత్తిమీర మంచి ఔషధం. ఈ ఆకు జీర్ణశక్తిని పెంచుతుంది.

కడుపు నొప్పి, కడుపులో మంట వంటివి ఉన్నవారు కూడా రోజు కొత్తిమీర తినడం వల్ల కడుపులో ఎలాంటి సమస్య ఉన్న పోతుంది.

ఉదయాన్నే మలబద్ధకం సమస్యతో బాధపడే వాళ్ళు కొత్తిమీర నీళ్లు తాగితే ఆ సమస్య కాస్త తగ్గుతుంది.

కొత్తిమీర తినడం వల్ల నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి

రోజువారీ ఆహారంలో కొత్తిమీరను చేర్చడం వల్ల LDL చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, HDL మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.