పిల్లలకు ఆహారం తినిపించడం అనేది తల్లిదండ్రులకు ఒక  సవాల్‌ అనే చెప్పాలి.

వాళ్లు తినేది కొద్దిగా మాత్రమే అయినప్పటికీ అందులోనే పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

 సాదా ఓట్స్, ఉబ్బిన ఓట్స్ వంటి అల్పాహారాలు పిల్లల ఆరోగ్యకరమైన జీవనశైలికి సహాయపడతాయి.

పండ్లు, పాల ఉత్పత్తులు, ఓట్స్ వంటివి కలిపి స్మూతీలు తయారు చేయవచ్చు. ఇది పిల్లలకు త్వరగా శక్తినిచ్చే అల్పాహారం.

అరటిపండ్లు, యాపిల్స్, ఓట్స్,  కార్న్‌ ఫ్లేక్స్ వంటివి పిల్లల కోసం ఉత్తమ అల్పాహారాలు. వీటిని పాలు లేదా పెరుగుతో కలిపి తీసుకోవచ్చు.

గుడ్లు పిల్లల ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్‌ను అందిస్తాయి.

పిల్లలకు పెరుగు పోషక విలువలు నిండిన అద్భుతమైన అల్పాహారం. ఇది జీర్ణక్రియకు సహాయపడతుంది.