త్రిఫల చూర్ణం అంటే మూడు పండ్లతో చేసిన మిశ్రమం
అని అర్థం.
ఇందులో ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమం ఉంటుంది.
జుట్టు, కళ్ళు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో త్రిఫల అద్భుతంగా సహాయపడుతుంది.
త్రిఫల శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.
యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నివారణలో త్రిఫల ప్రభావవంతంగా ఉంటుందని చాలా మంది పరిశోధకులు చెబుతున్నారు.
త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో త్రిఫల నీటిని తాగడం వల్ల జీర్ణాశయం శుభ్రపడుతుంది.
ప్రేగులలో పేరుకున్న విషాలు, వ్యర్థాలు బయటకు వెళతాయి.
మలబద్దకం సమస్య నివారిస్తుంది. తద్వారా పైల్స్ వంటి సమస్యల బాధ ఉండదు.
Related Web Stories
క్యారెట్స్ తింటున్నారా..?
రోజు రాత్రి వేడి పాలు తాగడం వల్ల కలిగే లాభాలివే..
బెండకాయ రసం.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
ఈ 5 లక్షణాలు కనిపిస్తుంటే.. మీ గుండె ప్రమాదంలో పడ్డట్లే..