ఈ 5 లక్షణాలు కనిపిస్తుంటే గుండె పోటుకు సంకేతం కావొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

అకస్మాత్తుగా బరువు పెరగడం గుండెపోటుకు సంకేతం కావొచ్చు. గుండె రక్తాన్ని సరిగా పంప్ చేయలేని సందర్భాల్లో శరీరంలోని ఇతర భాగాల్లో వాపు మొదలవుతుంది. 

పడుకున్న తర్వాత దగ్గు లేదా ఛాతిలో గురక రావడం కూడా గుండె సమస్యకు సంకేతం కావొచ్చు. 

ఆకలి లేకపోవడం, తిన్న తర్వాత త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడాలి.

గందరగోళం, చిన్న విషయాలను త్వరగా మర్చిపోవడం, ఏ పైని పైనా శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలను కూడా తేలిగ్గా తీసుకోవద్దు. 

రాత్రిళ్లు తరచూ మెలకువ రావడం, నిద్రపోయిన వెంటనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం కూడా గుండె సమస్యకు కారణం కావొచ్చు. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.