మధ్యాహ్నం నిద్ర వల్ల  కలిగే ఉపయోగాలివే.. 

మధ్యాహ్నం కునుకు తీయడం వల్ల ఉత్సాహం, శక్తి పెరుగుతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 

 మధ్యాహ్నం నిద్ర కండరాలకు కాసేపు విశ్రాంతినిస్తుంది. 

మధ్యాహ్నం నిద్ర తర్వాత. చేసే పనిపై ఫోకస్ పెరుగుతుంది. రోజు వారి ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. 

రక్తపోటు తగ్గుతుంది. హృదయ స్పందనల రేటు ఆరోగ్యకరంగా ఉంటుంది. 

బరువు నియంత్రణలో మధ్యాహ్నం నిద్ర బాగా ఉపకరిస్తుంది. 

ఆకలిని నియంత్రించడంలో, జంక్ ఫుడ్ వైపు దృష్టి వెళ్లకుండా చేయడంలో మధ్యాహ్నం నిద్ర సహాయపడుతుంది. 

సృజనాత్మక శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.