పాప్ కార్న్‌ తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

పాప్ కార్న్.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఇష్టంగా తింటారు. 

మొక్కజొన్న గింజలను కాస్త నూనెలో వేయించడం వల్ల పాప్ కార్న్ తయారవుతోంది. 

పాప్ కార్న్ రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి సైతం మేలు చేస్తోంది. 

నెయ్యి, ఉప్పుతో తయారు చేసిన పాప్ కార్న్ తింటే.. అనారోగ్యానికి గురయ్యే అవకాశముందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

పాప్ కార్న్‌లో విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. 

వీటిలో ఉండే ఫైబర్ రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహులకు ఫైబర్ ఫుడ్స్ చాలా అవసరం. వీరు పాప్ కార్న్‌ను బేషుగ్గా తినొచ్చని నిపుణులు చెబుతున్నారు.

వీటిలో ఉండే ఫైబర్ వల్ల ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. పేగుల ఆరోగ్యానికి ఫైబర్ ఎంతో ఉపయోగపడుతుంది.

మలబద్దకం సమస్యను సైతం నివారిస్తుంది.  

పాప్ కార్న్‌లో ఉండే ఫైబర్ ధమనులకు, రక్తనాళాల గోడలకు పేరుకు పోయిన అదనపు కొవ్వులను సైతం కరిగిస్తుంది. పాప్‌ కార్న్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడానికి సహాయపడతాయి.