పుచ్చకాయలు తినే సమయంలో చాలా మంది గింజలు కూడా తింటుంటారు. ఈ గింజలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పుచ్చకాయ గింజల్లోని ఒమేగా-3, ఒమేగా-6, ఆరోగ్యకర కొవ్వులు, మెగ్నీషియం వంటి పోషకాలు గుండెకు మేలు చేస్తాయి. 

పుచ్చకాయ గింజల్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

ఈ గింజల్లోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి.

పుచ్చకాయ గింజల్లోని ప్రొటీన్ డయాబెటిస్ రోగులకు ప్రయోజనం చేకూరుతుంది.

శరీరానికి శక్తిని అందించడంలో ఈ గింజలు దోహదం చేస్తాయి.

పుచ్చకాయ గింజల్లోని జింక్, మెగ్నీషియం.. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.