ఈ సమస్యలు ఉన్న వారు ఎండు ద్రాక్ష నీరు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఎండుద్రాక్షలోని ఇనుము ఎంతో మేలు చేస్తుంది.

మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడేవారికి కూడా ఈ నీరు మేలు చేస్తుంది. 

అలసట, బలహీనంగా ఉన్న వారికి ఈ నీటిలోని సహజ చక్కెర వల్ల ప్రయోజనం చేకూరుతుంది.

కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహకరిస్తుంది. 

ఈ నీటిలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుపరచడమే కాకుండా రక్తపోటును నియంత్రిస్తాయి.

రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారికి బాగా పని చేస్తుంది.

ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.