అల్పాహారంలో వీటిని తీసుకుంటే..
పొట్ట సమస్యలకు చెక్ పెట్టినట్లే..
అల్పాహారంలో ప్రోటీన్, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్న ఈ ఆహారాలు తీసుకుంటే రోజంతా మంచి ఎనర్జీతో ఉండవచ్చు.
ఆల్మండ్ బటర్.. దీన్నే బాదం వెన్న అంటారు. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
పీనట్ బటర్.. వేరుశనగ వెన్న ప్రోటీన్‍కు పవర్ హౌస్. చక్కరలేని వేరుశనగ వెన్నను ఉదయాన్నే స్మూతీస్, తృణధాన్యాల బ్రెడ్ తో కలిపి తీసుకోవచ్చు.
గ్రీక్ యోగర్ట్.. గ్రీకు పెరుగులో చిటికెడు ఉప్పు, వెల్లుల్లి, పుదీన, కొత్తిమీర వంటివి మిక్స్ చేయడం ద్వారా మరింత రుచిగా ఉంటుంది.
హమ్మస్.. హమ్మస్ అనేది శనగల నుండి తయారయ్యే పదార్థం. ఇది ప్లాంట్ బేస్డ్ సూపర్ ఫుడ్. దీన్ని రొట్టెలు, కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు.
పొద్దుతిరుగుడు వెన్న.. వేరుశనగ, బాదం లాగా పొద్దుతిరుగుడు విత్తనాలతో కూడా వెన్న తయారుచేస్తారు. దీన్ని కూడా తృణధ్యానాల బ్రెడ్, స్మూతీస్‍లో వాడొచ్చు.
Related Web Stories
బరువు, షుగర్ తగ్గాలంటే శనగలు ఇలా తింటే చాలు
అరటిపండు తింటే బీపీ,షుగర్ ఉన్నవారికి ఏం జరుగుతుంది
ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే హోమ్ మెడిసిన్ ఇదే
ఇలా చేస్తే అసిడిటీ క్షణాల్లో దూరమవుతుంది..