30 ఏళ్ల వయసు దాటిందా..  ఈ పరీక్షలు తప్పనిసరి..

పురుషులు, మహిళలు ఇద్దరూ 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రీడయాబెటిస్, హైపర్‌టెన్షన్, కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిస్ కోసం టెస్ట్ చేయించాలి.

ఊబకాయం ఉన్నవారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఈ పరీక్షలు చేయించుకోవాలి.

30 సంవత్సరాల నుంచి ప్రతి స్త్రీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. 

మహిళ 40 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా రొమ్ము క్యాన్సర్ కోసం మామోగ్రామ్‌లను చేయాలి. 

45 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత, 54 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా మామోగ్రామ్ చేయాలి. 

పురుషులు, మహిళలు ఇద్దరూ 45 ఏళ్లు దాటిన తర్వాత కొలొరెక్టల్ క్యాన్సర్‌ను పరీక్షించాలి.

5o నుంచి 80 సంవత్సరాల వయస్సు గల పురుషులు, మహిళలు ఇద్దరూ  ఊపిరితిత్తుల క్యాన్సర్  పరీక్షలు చేయించుకోవాలి.