అన్నం, చపాతీలను తినడం మానేయడం వల్ల శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి.

అన్నం, చపాతీలు తినడం మానేయడ వల్ల ఫైబర్ లోపానికి దారి తీస్తుంది. తద్వారా మలబద్ధకం, ఉబ్బరం తదితర సమస్యలు తలెత్తవచ్చు.

శరీరానికి అవరసమయ్యే కార్బోహైడ్రేట్లు అందకపోవడం వల్ల అలసట, బద్ధకం, మానసిక సమస్యలు పెరిగిపోతాయి.

కార్బోహైడ్రేట్లు తక్కువ అయినప్పుడు.. శరీరం వాటిని కండరాల కణజాలం నుంచి తీసుకుంటుంది. తద్వారా కండరాలకు నష్టం కలుగుతుంది.

బియ్యం, చపాతీల్లో ఇనుము, మెగ్నీషియం, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం మానేయడం వల్ల శరీరానికి పోషకాలు అందవు. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.