భోజనం చేసిన తరువాత అసలు  చేయకూడని పనులు ఇవే..

చాలా మంది అన్నం తిన్న తరువాత సిగరెట్​ తాగుతారు, మరికొంత మంది స్నానం చేసి బెడ్ ఎక్కుతారు

అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు 

స్మోకింగ్, స్నానం చేయడం, కూల్​ డ్రింక్స్ తాగడం అసలు చేయకూడదు

అన్నం తిన్నాక స్మోకింగ్ చేస్తే పొగ ప్రభావం పదింతలు ఎక్కువగా ఉంటుందంట 

భోజనం చేసిన తర్వాత చాలామంది స్నానం చేస్తుంటారు

ఇలా చేస్తే తిన్న ఆహారం జీర్ణం కాకపోగా, అలసటగా అనిపిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి

తిన్న వెంటనే పండ్లు తీసుకోవడం కూడా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

పండ్లు తినడం వల్ల అసిడిటీ సమస్య తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు