అన్నం శరీరానికి కావాల్సిన  కార్బోహైడ్రేట్లను అందిస్తుంది.

చలికాలంలో పాలిష్ తక్కువగా చేసిన అన్నం తినడం వల్ల  వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

శక్తిని ఇస్తుంది కాబట్టి.. క్రీడాకారులు ఎక్కువగా బ్రౌన్ రైస్ కంటే వైట్ రైస్‌నే ఎంచుకుంటారు.

వైట్ రైస్‪‌లో ఫైబర్ ఉంటుంది. ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అతిసారం ఉన్న వారికి బాగా ఉడికించిన అన్నం మేలు చేస్తుంది.

కూరగాయలతో కలిపి అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది.

అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రం వైద్యుడి సలహా మేరకు తీసుకోవాలి.

బియ్యం శరీరానికి ఇంధనంగా పనిచేస్తాయి. ముఖ్యంగా గ్లైకోజెన్ స్థాయిలను పునరుద్ధరించడంలో అన్నం సహాయపడుతుంది.