ప్రస్తుత రోజుల్లో డయాబెటిస్  అనేది పెద్ద ముప్పుగా మారింది

శరీరంలో ఏదైనా వ్యాధి ఉంటే దానికి సంబంధించిన లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి.

సకాలంలో ఈ లక్షణాల్ని గుర్తిస్తే తీవ్రమైన పరిణామాల్ని నుంచి తప్పించుకోవచ్చు.

 ప్రీ డయాబెటిస్ గురించి కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

ప్రీ-డయాబెటిస్‌ను మధుమేహం యొక్క బార్డర్ లైన్ అని పిలుస్తారు.

ప్రీ డయాబెటిస్ లక్షణాలను పట్టించుకోకపోతే.. మధుమేహ రోగిగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు.

షుగర్ వ్యాధి వచ్చే ముందు చేతులు, కాళ్ళలో జలదరింపు, తిమ్మిరి వంటి అనుభూతి కలుగుతుంది.

ప్రీ డయాబెటిస్‌లో రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతుంటాయి. దీంతో, కణాలు తగినంత శక్తిని పొందవు. శరీరం అంతటా అలసట, నీరసం వంటి అనుభూతికి దారితీస్తుంది.