దానిమ్మ కాయ ఆరోగ్యానికి చాలా మంచిది. రక్త హీనత సమస్యతో బాధపడుతున్నవారికి ఇది అత్యత్తమైన ఔషధం. దానిమ్మ పండు హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగు పరుస్తుంది. ప్రతి రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
దానిమ్మ కాయతోపాటు ఆ చెట్టు ఆకులతో సైతం బోలెడు ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ ఆకుల్లో మంచి ఔషధ గుణాలు ఉన్నాయట. వీటి రసం తాగడం వలన కామెర్ల వ్యాధి, డయేరియా, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తోంది. మరి ముఖ్యంగా జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుందంట.
ఈ ఆకులు మరగ బెట్టి ఆ రసాన్ని ప్రతి రోజూ ఉదయం పరగడుపున లేదా రాత్రి పడుకొనేటప్పుడు తాగడం వలన అది శరీరానికి మంచి పోషకాలను అందిస్తుందంట.
నిద్రలేమి సమస్యను తగ్గిస్తుందంట. ఇక ఈ ఆకుల రసాన్ని ప్రతి రోజూ తాగడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందట.
సీజనల్ వ్యాధులు దగ్గు, జలుబు సమస్యలతో బాధపడే వారికి కూడా దానిమ్మ ఆకుల రసం ఒక వరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇక ఈ ఆకుల పేస్ట్ చర్మ వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు.